Wednesday, May 27, 2009

షరతుల పెళ్ళికొడుకులు -- In Telugu

గమనిక: ఓ పేరుగాంచిన పెళ్ళిసంబంధాల వెబ్ సైట్లో కొన్ని తమాషా ప్రకటనలు ఇవి.  

ఇలా ప్రకటనలివ్వగలిగిన వారి ధైర్యానికి జోహార్లు చెప్పుకుంటూ,  

హృదయాంతరాళాల్లోంచి వచ్చిన మాటలు కాబట్టి స్పెల్లింగులు, వ్యాకరణం పట్టించుకోకుండా విషయం చదవండి. ఇవెవర్నీ కించపరచటానిక్కాదు, సరదాగా నవ్వుకోండి అంతే.
*************
I want very simple girl. from brahmin educated family from orissa state. he is also know about
RAMAYAN, GEETA BHAGABATA, and other Homework.
వీడి ధైర్యం దొంగలెత్తుకెళ్ళ. రామాయణం, గీత చదివి వినిపించింది చాలక, అంట్లు కూడా కడుగే అమ్మాయి కావాలి అని నైసుగా "హోం వర్క్" అంటున్నాడు.

ఏ సంధ్య గారో, పుణ్యవతి గారో చూస్తే వీడి గతేం కాను?  ఆ మాట కొస్తే మన బ్లాగ్వనితల పాల్పడినా వీడి పని అంతే  
Wants a woman who knows me better and can adjust with me forever.

She may never create any difficulties in my life or her life by which the entire life can run smoothly.

thank you
వీడు సరేసరి, నేను మారేది లేదు, నన్ను జీవితాంతం సర్దుకు పోయే అమ్మాయి కావాలని ఇప్పుడే ఘంటాపదంగా చెబుతున్నాడు.

అంతటితో ఆగాడా, ఉహూ, తనకే కష్టం కలిగించగూడదుట, మరి వీడి సంగతో? వీడి ప్రకటన వీడి మెడకి తగిలించి, కోఠీ ఉమెన్స్ కాలేజీ ముందు నిలబెడితే వీడి పరిస్థితేమిటా అని ఆలోచిస్తున్నా…
She should be good looking and should have a service.

She Shoulsd have one brother and one sister.

She should be educated.
అందగత్తెట, సరే ఒప్పుకుంటాం కానీ మళ్ళీ వీడు సర్వీస్ అంటున్నాడు.

ఇదీ అంట్లు తోమే పని కాదు గదా? భలే పదాలు కనిపెడుతున్నారే. సరే అదీ సర్దుకుపోయే అమ్మాయి దొరికిందనుకో, మళ్ళీ ఒక్క తమ్ముడు, ఒక్క చెల్లెలే ఉండాలిట.

ఇదెక్కడి ఫిట్టింగు? పోనీలెండి , నేను అమ్మాయి తరఫు మరో ఇద్దరిని పోషిస్తా అంటున్నాడేమో. ఏమో నమ్మేట్టులేదు, వాళ్ళిద్దర్నీ పన్లో అదే సర్వీస్లో పెడతాడేమో? మరిచా, చివర్లో చదువుకున్నదయి ఉండాలంటున్నాడోచ్!
I am a happy-go-lucky kind of person. Enjoys every moments of life. I love to make friendship. Becauese friendship is a first step of love.

I am looking for my dreamgirl who will love me more than i. Because i love myself a lot. If u think that is u then why to late come on …….. hold my hand forever !!!
స్నేహం ప్రేమకి పునాది తో మొదలెట్టాడు. అనుమానం లేదు, వీడు "దిల్వాలే దులహనియా లేజాయేంగే" ఓ పది సార్లు చూసుంటాడు.
i am simple boy.I have lot of problem in mylife because of my luck.

now i am looking one girl. she care me and love me lot lot lot.
వీడు భలేగా నచ్చాడు నాకు, వీడి ధైర్యానికి. బహుశా "కార్యేషు దాసీ…" బాగా వంటపట్టించుకున్నట్లున్నాడు.

నేను కష్టాల్లో మునిగున్నాను, వచ్చి నాకు సేవలు చేసి తరించమని నిర్భయంగా చెబుతున్నాడు.  వీణ్ణి గానీ మన తెలంగాణా శకుంతల చూస్తే, పిచ్చకొట్టుడే  
My wife should be as 'Parwati' as in Kahani Ghar Ghar Ki and as Tulsi as in KSBKBT……
ఇహ వీడి గురించేమని చెప్పను. వీడు నేరుగా స్పెక్స్ (Specifications) ఇచ్చేశాడు.

ఈ ధారావాహికాలు నేను చూడలేదుగానీ, పార్వతీ దేవి మరియు తులసమ్మ (తులసి చెట్టు) కంటే గొప్పవాళ్ళు కాదనుకుంటా. వీడు నిజంగా గుండెలు తీసిన బంటే!
i want a girl with no drinks if she wants she can wear jeans in house but while steping out of house she should give recpect to our cast.
ఈ ప్రబుద్ధుడి కోరికలు విని నా గొంతు మూగపోయి మాటలు రావట్లా. గర్ల్ విత్ నో డ్రింక్సా, అదేదో వాటర్ విత్ నో అయిస్ లాగా.  

బాగా జాలిగుండె కాబోలు,  ఇంట్లో జీన్స్ వేసుకోనిస్తాట్ట, కానీ కులానికి మర్యాదివ్వకపోతే, ఖబడ్దార్ అంటున్నాడు. అమ్మో, తేనె పూసిన కత్తే వీడు.


HYE I AM A GOOD LOKING GUY,WHO HAS THE CAPABILITY TO MAKE ANY BODY TO LOUGH.
I BELIEVE IN GOD AND ACCORDING TO ME FRIENDS ARE THE REAL MESSENGER OF GOD.

THE 3 THINGS I AM LOOKING FROM A GIRL ,THEY ARE
1.THEY MUST BELIEVE IN GOD.
2.THEY HAVE TO LIKE MY PROFFESION
3.SHOULD NOT GET BORED WITH ME WHEN I WILL TRY TO MAKE THEM LOUGH.
వీడు మొదలెట్టటమే కాపిటల్ లెట్టర్స్లో. అంటే, ఒళ్ళు దగ్గరపెట్టి చదవమంటున్నాడు. చచ్చింది గొర్రె.

వీడు అందగాడుట, సరే. అందర్నీ నవ్వించగలట్ట, అబ్బో కళాకారుడే. దేవుణ్ణి నమ్ముతాట్ట. మంచి లక్షణమయినవాడికి మల్లేనే ఉన్నాడు కదా.

ఆగండి మరి.. వీడు ఓ మూడు షరతులు పెట్టాడండీ అమ్మాయికి.

అమ్మాయి కూడా దేవుణ్ణి నమ్మాలిట, బాగుంది.

వీడి వృత్తిని అమ్మాయి ఇష్టపడాలిట.

వీడు నవ్వించే ప్రయత్నం చేస్తుంటే బోర్ గా ఫీల్ అవకూడదుట.

అంటే, నిర్భంధించి నవ్విస్తాడా? ఏమో? ఇప్పుడు నాకు నిజంగానే నవ్వొస్తోంది  
whatever she may be but she should feel that she is going to be someone bride and she must think of the future life if she is toolike this she would bde called the lady of the lamp
ఆమె ఎవరైతే నాకేమిటి, తను ఒకడి భార్య కాబోతోందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరికతో మొదలెట్టాడు వీడు.

అంతే, ఆ తర్వాత ఈ అర్భకుడికి వీడు చెప్పిన ఒక్క ముక్క అర్థం కాలా. మీకేమైనా తెలిస్తే చెప్పండి, ప్లీజ్…  
my name is xxxxx and i am unmarried. please you marrige me pleaes pleaes pleaes pleaes pleaes pleaes pleaes
వీడి పెళ్ళికోసం ఏమైనా చేసేట్టున్నాడు. ఛీ, పెళ్ళి కోసం ఇంతగా మొహం వాచిన వెధవని ఇప్పటిదాకా చూళ్ళా.

మగవాళ్ళ పరువు ఇంతగా తీసిన వీడికి ఇదే నా శాపం. ఓ చితక్కొట్టుడు పెళ్ళాంతో వీడికి పెళ్ళి అవుగాక!   అయిదేళ్ళ తర్వాత శాపవిముక్తి.
iam xxxx my family histoy my two brother two sister and fater & mother sister completely marred
పూర్తిగా పెళ్ళిచేసుకోవటమా? అంటే సగం పెళ్ళి అని ఒకటుందా?ఎప్పుడూ వినలేదే?  
hello i am a good charactarised man. i want to run my life happily.
i divorced my first wife.her charactor is not good'.

i expect the good minded and clean habits girl who may be in the same
caste or other caste accepted ..
వీడు మరీ నిజాయితీగా నటిద్దామని, చెప్పకూడనివి కూడా చెప్పేసినట్లున్నాడు.  

వీడి నిజాయితీ ఏడ్చినట్టే ఉంది. త్రేతాయుగంలో సీతని అనుమానించిన దేవుడైన రాముణ్ణి ఇప్పటికీ ఆడవాళ్ళు క్షమించట్లా.

వీడు పాత భార్య మీద అభాండం వేస్తూ, కొత్త భార్యని వెదుకుతున్నాడు. వీణ్ణి నమ్ముతారంటారా?  


i am little fair indian colour. i don't have any habit.

i do exercise and health person.looking good girl. should maintain house well.
పాపం, వీడి ఉద్ధేశ్యం దురలవాట్లేమి లేవని కాబోలు!   
iam xxxx. i do owo businas.one sistar.he was marred.
వీడెంత ముదురు అంటే, నాకు అమ్మాయి కావాలి అని కూడా అడగట్ట.  బాగా సేఫ్ గా ఆడుతున్నాడు.  
I want one girl who love me or my mother. she love me heartly or she havea frank she's skin colour 'normal'not a black or not a whitey.

I Think the main think is heart if your heart is beautiful then you are beautiful. but iam not a handsome person or not a good looking.

but my Mom say that Iam a good person.  iam "Aeklauta". The choice is your. bye bye.
వీడెవడో కాస్త ఉత్తమ పురుషుడల్లే ఉన్నాడు. కాకపోతే, వీడు అమ్మకూచి అనుకుంటా.
hi iam very cool nauther ok my hobby is see t.v. and news ok i have 1 car and 1 bowl ok my mother also good ok my faruet world is ok
వీడు అన్నీ ఓకే ఓకే అంటున్నాడు ఏమిటో..

ఒక కారు అన్నాడు బాగుంది, కానీ ఒక చిప్ప అని కూడా అంటున్నాడు దరిద్రంగా.

ఏమిటో వీడి గొడవ… కొంపదీసి బంగళా అనా వాడి ఉద్దేశ్యం? అమ్మో, ఇంతకు మించి అనువదించుకోటం నా వల్ల కాదు కుర్రోయ్..  
i love my patner ok i marriage the patner ok i search my patner ok and i love the patner ok thik hai the patner has a graduate ok  
వీడింకో ఓకే బాబు. నేను ప్రేమిస్తా, నేను వెతుక్కుంటా, నేను ప్రేమిస్తా సరేనా? అంటున్నాడు.

ఆ సరే బాబూ. కానీ, అమ్మాయి చదువుకొనుండాలి అంటున్నాడు. వాడే వెతుక్కుంటే, ఏ అమ్మాయి కావాలో మనకెందుకు చెప్పటం?  
iam very simpel and hanest. i have three sister one brother and parent.

want a cooking girl.i am doing postal sarvice and tailor master my original resdence at kalahandi diste.
వీడికి కావాల్సింది వంటమనిషా, ఇంటిమనిషా? ఎందుకో అనుమానంగా ఉంది!   
iam good person. have 2 parents. need good girl. shoud love parents.

caring and to love them. help for them. i love my parents. shoud know cook. education medium.
వీడు ఆలోచనల్లో శ్రవణకుమారుడే, డౌట్ లేదు.

కానీ ఆచరణలో ఆ క్రెడిట్ భార్య ద్వారా కొట్టేద్దామనుకుంటున్నాడు.అమ్మా! తనకి భార్య కావాలన్న తాపత్రయం కంటే, తల్లితండ్రులకి సేవలు చేసే అమ్మాయి కావాలన్న తాపత్రయం కనపడుతోంది.

వీడి భక్తిని శంకించలేం కానీ, ఇలా అడగటం సబబేనా అన్నది ???

అందులోనూ చదువులో డిస్కౌంట్ ఇచ్చాడు.

వంట మాత్రం ఒక్కడు కూడా అడగటం మర్చిపోవట్లా.

కొంపదీసి ఇండియాలో కూడా మగాళ్ళు వంటలు వార్చేస్తున్నారా ఏమిటీ? ఒక్కొక్కడూ తెగ భయపడి చస్తున్నాడు వంట అంటే.  
looking a famili girl. god loving. lot of patence. should take care of me and my famuly well.

she canot go out to working just need to take care home and children after marrage. i have good job so money no issue. i have parents and sister.
వీడు కుండ బద్దలు గొట్టేసి చెబుతున్నాడు, ఇంటిపట్టునే పడుండాలని. అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయాడు… ఏమిటో …నాకైతే పిచ్చినాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడనిపిస్తోంది ….   
ఇదండీ వరస మన పెళ్ళికొడుకులది. పోనీ సత్తెకాలపు వాళ్ళనుకుందామా అంటే, అదీకాదు. అంతర్జాలంలోకొచ్చి మరీ ప్రకటనలిచ్చారే.
వీళ్ళందరికీ "తగిన" భార్యలు ఈ పాటికి దొరికి ఉంటారనే ఆశిద్దాం.
 జై బోలో మేరా భారత్ మహాన్! 

No comments:

Post a Comment